Babu Godineni: బాబు గోగినేనికి మద్దతు పలికిన కత్తి మహేష్

  • బాబు గోగినేనిపై పోలీసు కేసు నమోదు
  • మతం పేరిట వ్యాపారాన్ని వ్యతిరేకించినందునే
  • కేసులను తొలగించాలని కత్తి డిమాండ్
మాదాపూర్ పోలీసు స్టేషన్ లో హేతువాతి బాబు గోగినేనిపై కేసు నమోదుకావడం వెనుక దొంగస్వాములు, బాబాలమని చెప్పుకు తిరుగుతున్న వారి హస్తం ఉందని సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ వ్యాఖ్యానించాడు. వీర నారాయణ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు రిజిస్టర్ చేయగా, జనవిజ్ఞానవేదిక ప్రతినిధులతో కలసి కత్తి మహేష్ మీడియాతో మాట్లాడాడు.

 మతం పేరిట జరుగుతున్న వ్యాపారాన్ని వ్యతిరేకిస్తున్నందునే గోగినేనిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించాడు. ఆయన ప్రస్తుతం జన జీవన స్రవంతిలో లేరని, బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయాన్ని చూసి ఈ కేసు పెట్టారని కత్తి అన్నారు. ఆయన హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాతనే ఏం జరిగిందన్న విషయం తెలుస్తుందని చెప్పాడు. ఆయన ప్రాణాలకు హాని కలిగే ప్రమాదం ఉందని, ఆయనకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశాడు. ఆయనపై కేసులను వెంటనే తొలగించాలని కోరాడు.
Babu Godineni
Kathi Mahesh
Bigboss
Police
Hyderabad

More Telugu News