YSR: టాలీవుడ్ గుసగుస... వైఎస్ఆర్ బయోపిక్ ప్రమోషన్ లో భాగం కానున్న ప్రభాస్?

  • మమ్ముట్టి హీరోగా నిర్మితమవుతున్న వైఎస్ బయోపిక్
  • చిత్ర నిర్మాత విజయ్, ప్రభాస్ మంచి మిత్రులు
  • స్టోరీ విని ఇంప్రెస్ అయిన ప్రభాస్

మమ్ముట్టి హీరోగా, మహి వీ రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బయోపిక్ 'యాత్ర'లో ప్రభాస్ భాగం కానున్నారని ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్ లో వినిపిస్తోంది. సినిమా నిర్మాత, 'ఆనందో బ్రహ్మ' ఫేమ్ విజయ్ ఈ చిత్రానికి నిర్మాతగా ఉండటం, విజయ్, ప్రభాస్ మంచి మిత్రులు కావడంతో సినిమా ప్రమోషన్ కు తాను పూర్తి సహాయ సహకారాలను అందించేందుకు అంగీకరించాడట.

ఈ సినిమా స్టోరీని విని ఇంప్రెస్ అయిన ప్రభాస్, బడ్జెట్ గురించి ఆలోచించ వద్దని విజయ్ కి సూచించినట్టు సమాచారం. సినిమాకు తనవంతు సాయం చేస్తానని హామీ ఇచ్చాడని, సినిమా ప్రమోషన్ లో ఆయన భాగమవుతారని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో వైఎస్ సతీమణి విజయమ్మ పాత్రను 'బాహుబలి' ఫేమ్ ఆశ్రిత వేముగంటి పోషిస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News