Diamonds: సూరత్ జ్యూవెల్లర్స్ గిన్నిస్ రికార్డు... 6,690 వజ్రాలు పొదిగిన ఉంగరం తయారు!

  • 18 క్యారెట్ రోజ్ గోల్డ్ తో తయారు
  • ధర రూ. 28 కోట్లు
  • తామరపువ్వు ఆకృతిలో ఉంగరం

సూరత్ కు చెందిన ఓ జ్యూవెలరీ దుకాణం, 6,690 వజ్రాలను పొదిగిన ఉంగరాన్ని తయారు చేసి గిన్నిస్ రికార్డును సాధించింది. విశాల్ అగర్వాల్, ఖుష్బూ అగర్వాల్ లు ఈ ఉంగరాన్ని 18 క్యారెట్ రోజ్ గోల్డ్ తో తయారు చేశారు. తామరపువ్వు ఆకారంలో ఉన్న ఉంగరంపై 48 తామర రేకులు కనిపించేలా చేసిన వీరు, ప్రతి రేకుపైనా వజ్రాలను పొదిగారు.

 దీని తయారీకి దాదాపు ఆరు నెలల సమయం పట్టిందని, జాతీయ పుష్పంగా ఉన్న తామరపువ్వు ఆకృతిలో ఉంగరాన్ని తయారు చేసి, రికార్డు నమోదు చేయాలని భావించామని వారు తెలిపారు. దీని వెల సుమారు రూ. 28 కోట్లు ఉంటుందని చెప్పారు. కాగా, ఈ ఉంగరం గురించి గిన్నిస్ రికార్డు అధికారులు తమ ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు పెట్టగా, మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి.

  • Loading...

More Telugu News