RS Brothers: హైదరాబాద్ ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం

  • అబిడ్స్ మాల్ లో అగ్నిప్రమాదం
  • భారీ ఆస్తి నష్టం
  • చాలాసేపు ట్రాఫిక్ జామ్

హైదరాబాద్, అబిడ్స్ ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గత రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. ఈ ప్రమాదంలో భారీ ఆస్తినష్టం జరిగినట్టు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు అంటుకున్నట్టు ప్రాథమిక సమాచారం. షాపింగ్ మాల్ లో ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. ఈ ఘటన కారణంగా అబిడ్స్ ప్రధాన రహదారిపై ట్రాఫిక్ చాలాసేపు నిలిచిపోయింది.

More Telugu News