yarra narayanaswamy: వైసీపీలో చేరనున్న టీడీపీ సీనియర్ నేత యర్రా నారాయణస్వామి కుమారుడు

  • టీడీపీకి గుడ్ బై చెబుతున్న యర్రా నవీన్
  • కాపు కార్పొరేష్ డైరెక్టర్ గా పని చేసిన నవీన్
  • ఛైర్మన్ పదవి లభించకపోవడంతో అసంతృప్తి
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యర్రా నారాయణస్వామి కుమారుడు నవీన్ వైసీపీలో చేరనున్నారు. వైసీపీ నేత, ఉండి ఎమ్మెల్యే సర్రాజు ఆయనతో జరిపిన మంతనాలు సఫలీకృతమయ్యాయి. పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తామని... వైసీపీలోకి రావాలంటూ సర్రాజు ఆహ్వానించడంతో... నవీన్ అంగీకరించారు. త్వరలోనే పార్టీ అధినేత జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా నారాయణస్వామి పని చేశారు. ఆయన కుమారుడు నవీన్ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా బాధ్యతలను నిర్వహించారు. కాపు కార్పొరేషన్ ఛైర్మన్ గా అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబును అడిగినప్పటికీ... ఫలితం దక్కలేదు. తన కుమారుడికి ఛైర్మన్ గా అవకాశం ఇవ్వాలని యర్రా పట్టుబట్టినా... చివరకు ఆ పదవిని కొత్తపల్లి సుబ్బరాయుడికి ఇచ్చారు. ఈ నేపథ్యంలో అసంతృప్తికి గురైన నవీన్... పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చారు.

yarra narayanaswamy
yarra naveen
YSRCP
Telugudesam

More Telugu News