Bahubali-2: కుమారవర్మ గెటప్ లో జపాన్ లో సుబ్బరాజు... బ్రహ్మరథం పట్టిన జపనీయులు... ఫొటోలు చూడండి!

  • జపాన్ లో విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న 'బాహుబలి-2'
  • ఓ థియేటర్ ను సందర్శించిన సుబ్బరాజు
  • ఫొటోలు పోస్టు చేసిన బాహుబలి టీమ్
'బాహుబలి-2'లో తొలుత అమాయకుడిగా, ధైర్యం లేనివాడిగా కనిపిస్తూ, చివరకు శత్రువులతో భీకరంగా పోరాడే కుమారవర్మ క్యారెక్టర్ ను పోషించిన సుబ్బరాజుకు జపాన్ లో సినీ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ చిత్రం జపాన్ లో మంచి కలెక్షన్లు సాధిస్తూ ఉండటంతో, జపాన్ కు వెళ్లిన సుబ్బరాజు, కుమారవర్మ వేషంలో ఓ థియేటరుకు వెళ్లగా, జపనీయులు ఊహించని రీతిలో స్వాగతం పలికారు. ఆ చిత్రాలను బాహుబలి టీమ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.

"జపాన్ వాసులు మా కుమారవర్మపై చూపిన ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు. సుబ్బరాజు ఆనందాన్ని చూసి ఆశ్చర్యపోయాం" అని ట్వీట్ చేసింది. జపాన్ సినిమా హాల్ లో సుబ్బరాజు తీసుకున్న సెల్ఫీలను మీరు కూడా చూడవచ్చు. సినిమాలోని అన్ని క్యారెక్టర్లూ తమకు నచ్చినప్పటికీ, సుబ్బరాజు పోషించిన కుమారవర్మ క్యారెక్టర్ చాలా సహజంగా ఉందన్నది జపాన్ సినీ ప్రేక్షకుల అభిప్రాయం.
Bahubali-2
Japan
Subbaraju
Kumaravarma

More Telugu News