Pawan Kalyan: విమ్స్ ని ప్రైవేటీకరించేందుకు టీడీపీ ప్రభుత్వం సిద్ధపడుతోంది: పవన్ కల్యాణ్ ఆరోపణ

  • విశాఖపట్టణంలో ప్రజా పోరాటయాత్ర
  • విశాఖలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన జనసేనాని
  • రోగులను పరామర్శించి.. వైద్య సేవలపై ఆరా తీసిన పవన్
విశాఖపట్టణంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రజా పోరాట యాత్ర కొనసాగుతోంది. ఇందులో భాగంగా విశాఖలోని ప్రభుత్వ ఆసుపత్రి విమ్స్ లో ఈరోజు ఆయన పర్యటించారు. అక్కడి రోగులను పరామర్శించిన పవన్, వైద్యసేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర దోపిడీలో భాగంగా విమ్స్ ని ప్రైవేటీకరణ చేసేందుకు టీడీపీ ప్రభుత్వం సిద్ధపడుతోందని ఆరోపించారు. ‘బొగ్గు, జబ్బులు మాకా? డబ్బులు వారికా?’అని విశాఖ జిల్లా పోర్ట్ కాలుష్య బాధితులు తనను అడిగిన విషయాన్ని పవన్ ప్రస్తావించారు. 
Pawan Kalyan
Visakhapatnam District

More Telugu News