pc market: దేశ పీసీ మార్కెట్లో మొదటి స్థానానికి హెచ్ పీ, రెండో స్థానానికి వెళ్లిన డెల్

  • జనవరి-మార్చి కాలంలో హెచ్ పీ మార్కెట్ వాటా 28.9 శాతం
  • 23.4 శాతం వాటాతో రెండో స్థానంలో డెల్
  • మూడో స్థానంలో లెనోవో... 21.8 శాతం మార్కెట్ వాటా

దేశ పీసీ మార్కెట్లో హెచ్ పీ తిరిగి మొదటి స్థానానికి చేరుకుంది. 2018 జనవరి-మార్చి కాలంలో పర్సనల్ కంప్యూటర్లలో  28.9 శాతం వాటాతో మార్కెట్ లీడర్ గా నిలిచింది. డెల్ మొదటి స్థానాన్ని కోల్పోయింది. 23.4 శాతం వాటాతో రెండో స్థానంలోకి వచ్చేసింది. సైబర్ మీడియా రీసెర్చ్ నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. లెనోవో కంపెనీ 21.8 శాతం వాటాతో మూడో స్థానంలో ఉంది. సంస్థల నుంచి కొనుగోళ్లు పెరగడంతో మొత్తం మీద మొదటి క్వార్టర్లో పీసీ అమ్మకాల వృద్ధి 4 శాతంగా నమోదైంది. సంస్థల విభాగంలో వృద్ధి 5 శాతం ఉంటే, రిటైల్ విభాగంలో 2 శాతంగానే ఉంది. కంపెనీలు తమ వ్యాపార భాగస్వాములకు ప్రోత్సాహకాలు ఇవ్వడం అమ్మకాల వృద్ధికి కలిసొచ్చినట్టు ఈ నివేదిక తెలియజేసింది. 

  • Loading...

More Telugu News