Chandrababu: కట్, పేస్ట్ చేసిన వీడియో క్లిప్పింగులు వదులుతున్నారు: చంద్రబాబు

  • మన ధర్మపోరాటాన్ని యావత్ దేశం గమనిస్తోంది
  • కొందరు తప్పుడు వీడియోలను వదులుతున్నారు
  • కుట్రదారులు, పాత్రధారుల భాగోతాలను బట్టబయలు చేస్తాం
రాష్ట్ర హక్కుల కోసం మనం ధర్మపోరాటం చేస్తున్నామని... మన పోరాటాన్ని యావత్ దేశం గమనిస్తోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మనం చేస్తున్న పోరాటంపై బురద చల్లేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కొందరు తప్పుడు వీడియోలను వదులుతున్నారని మండిపడ్డారు. ఎంపీ మురళీ మోహన్ అన్న మాటలను కట్, పేస్ట్ చేసి... తప్పుడు వీడియోను విడుదల చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి యావత్ రాష్ట్రం కుతకుతలాడుతోందని చెప్పారు. కుట్రదారులు, పాత్రధారుల భాగోతాలను బట్టబయలు చేస్తామని తెలిపారు.
Chandrababu
Andhra Pradesh
Chief Minister

More Telugu News