Pawan Kalyan: ‘మీ పెళ్లికి పవన్ అన్న వస్తారా?: రేణూ దేశాయ్ కు నెటిజన్ ప్రశ్న

  • నా పెళ్లికి పవన్ వస్తారో? లేదో? ఆయన్నే అడగండి
  • నా పిల్లల గురించి మీకెందుకు బాధ?  
  • రేణూదేశాయ్ ఆసక్తికర సమాధానాలు
నటి రేణూ దేశాయ్ రెండో పెళ్లి చేసుకోనున్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసినప్పటి నుంచి పవన్ కల్యాణ్, రేణూ దేశాయ్ అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా ఆమెకు పలు ప్రశ్నలు సంధించడమే కాకుండా ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారు. ఓ సామాజిక మాధ్యమంలో లైవ్ లో నిర్వహించిన కార్యక్రమంలో నెటిజన్ల ప్రశ్నలకు రేణూదేశాయ్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది.

* మీ పెళ్లికి పవన్ అన్న వస్తారా?

రేణూ దేశాయ్: ఆయన్నే అడగండి. ఆయన కూడా సోషల్ మీడియాలో ఉన్నారుగా

* పీకే మళ్లీ కలిసుందామంటే వస్తారా?

 రేణూ దేశాయ్: మీకు, నిజంగా భారతరత్న ఇవ్వాలి!

* మేడమ్.. మీ పిల్లల గురించే నా బాధ?

రేణూ దేశాయ్: నా పిల్లల గురించి మీరు బాధపడొద్దు. వాళ్లకు తల్లి, తండ్రి.. పెదనాన్న, నానమ్మ, పిన్ని, పెద్దమ్మ... చాలామంది ఉన్నారు. మీరు, అసలు టెన్షన్ పడొద్దు. మీరు, మీ పిల్లలను సంతోషంగా చూసుకుంటే చాలు

* అకీరా హీరోగా యాక్టు చేస్తాడా?

రేణూ దేశాయ్: అకీరాకు యాక్టింగ్ ఇష్టం లేదు

*  మీరు వేరే పెళ్లి చేసుకుంటామనడం మాకు బాధగా ఉంది ?  

రేణూ దేశాయ్: నేను పెళ్లి చేసుకుంటానంటే మీకెందుకు బాధ? నేను మీ ఇంటి అమ్మాయిని కాదు. మీ ఇంటి అమ్మాయి గురించి మీరు ఆలోచించుకోవాలి. సెలెబ్రిటీస్, పొలిటీషియన్స్ గురించి ఇంత పర్సనల్ గా మీరు ఆలోచించకూడదు. 
Pawan Kalyan
renu desai

More Telugu News