mumbai: ముంబైలో కుప్పకూలిన విమానం మాది కాదు: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం

  • చార్టెడ్ విమానం కూలిన ఘటనలో ఐదుగురు దుర్మరణం
  • గతంలోనే ఆ విమానాన్ని అమ్మేశామన్న యూపీ అధికారి
  • గతంలో అహ్మదాబాద్ లో ఓ ప్రమాదానికి గురైన విమానం

ముంబైలో ఓ చార్టెడ్ విమానం కుప్పకూలిన ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. వీరిలో ఇద్దరు పైలట్లు ఉన్నారు. ఈ విమానం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి చెందినదంటూ వార్తలు వచ్చాయి. అయితే, ఆ చార్టెడ్ విమానం తమది కాదని యూపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. యూపీ సమాచార విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ, ఆ విమానాన్ని ముంబైకి చెందిన యూవై ఏవియేషన్ కు గతంలోనే అమ్మేశామని తెలిపారు. అలహాబాద్ లో ఓ ప్రమాదానికి గురైన తర్వాత దాన్ని అమ్మేయాలనే నిర్ణయానికి యూపీ ప్రభుత్వం వచ్చిందని చెప్పారు.

కూలిపోయిన విమానం బీచ్ క్రాఫ్ట్ కింగ్ ఎయిర్ సీ-90 రకానికి చెందినది. ఈ విమానం 1995లో యూపీ ప్రభుత్వానికి అందినట్టు సమాచారం. 2014లో యూపీ ప్రభుత్వం నుంచి యూవై ఏవియేషన్ ఈ విమానాన్ని కొనుగోలు చేసింది. 10 మంది ప్రయాణించే సదుపాయం ఇందులో ఉంది. 

  • Loading...

More Telugu News