Yanamala: రాజన్న రాజ్యం తెస్తావా జగన్‌?: యనమల ఎద్దేవా

  • రాజన్న రాజ్యం తెస్తానని జగన్‌ చెబుతున్నారు
  • జగన్‌ తెచ్చేది క్రాప్‌ హాలీడేనా? పవర్‌ హాలీడేనా?
  • వైఎస్ హయాంలో 14,079 మంది రైతుల ఆత్మహత్యలు
  • ఆ పాలన మళ్లీ తెస్తారా?
తిరిగి రాజన్న (వైఎస్సార్‌) రాజ్యం తెస్తానని చెబుతోన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి తెచ్చేది క్రాప్‌ హాలీడేనా? లేక పవర్‌ హాలీడేనా? అని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు.

ఈరోజు ఆయన విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో... "వైఎస్సార్‌ హయాంలో 14,079 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ పాలన మళ్లీ తెస్తారా? విద్యుత్‌ సరఫరా లేక 15 రోజులు పరిశ్రమలు మూతపడిన పాలన తెస్తారా? 11 లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డ పాలన తెస్తారా? ఒక బస్తా ఎరువుకు రెండు లాఠీ దెబ్బలు ఉచితం అనే పాలన తెస్తారా? పోలీస్‌ స్టేషన్‌లలో విత్తనాలు పంపిణీ చేసిన పాలన తెస్తారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
Yanamala
Jagan
YSRCP

More Telugu News