Chandrababu: సీబీఐతో దాడులు చేయించే సంస్కృతి బీజేపీది కాదు: పురందేశ్వరి

షార్ట్స్‌లో చూడండి
ఏపీ ప్రభుత్వంపైన, సీఎం చంద్రబాబుపైన సీబీఐ విచారణను బీజేపీ జరిపించదని, కక్ష గట్టడం, సీబీఐతో దాడులు చేయించడం వంటివి తమ పార్టీ సంస్కృతి కాదని ఆ పార్టీ మహిళా మోర్చా నేత పురందేశ్వరి అన్నారు. గుంటూరులో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు ఘనతను కాంగ్రెస్ కు ఆపాదించడం సబబు కాదని అన్నారు. కాంగ్రెస్ హయాంలో నయాపైసా కూడా ఈ ప్రాజెక్ట్ కు మంజూరు చేయలేదని ఆరోపించారు. యుటిలిటి సర్టిఫికెట్లు ఇవ్వకుండా రాష్ట్రానికి కేంద్రం నిధులు ఎలా మంజూరు చేస్తుందని ప్రశ్నించిన ఆమె, ఏపీకి ప్రత్యేక హోదాకు మించి నిధులు ఇచ్చామని పేర్కొన్నారు.
Go Back to Shorts
Chandrababu
puandeswari

More Telugu News