కొత్తవలస - కొరాపుట్ రైల్వే లైన్ జంబ్లింగ్ పనులపై పీఎం ఆరా
- ఏపీలోని కొత్తవలస.. ఒడిశాలోని కొరాపుట్ మధ్య రైల్వే పనులు
- పీఎంఓ కార్యాలయం నుంచి వీడియా కాన్ఫరెన్స్ నిర్వహణ
- జంబ్లింగ్ పనుల గురించి వివరించిన రైల్వే బోర్డు చైర్మన్
ముందుగా రైల్వే బోర్డు చైర్మన్ అశ్విన్ లోహణి మాట్లాడుతూ, ఏపీలోని కొత్తవలస- ఒడిశాలోని కొరాపుట్ మధ్య రైల్వే లైన్ లో జరుగుతున్న జంబ్లింగ్ పనులను వివరించారు. 189 కిలో మీటర్లలో 4 భాగాలుగా ఈ పనులు చేపట్టామని చెప్పారు. అనంతరం, ఏపీ ఇంఛార్జి సీఎస్ అనిల్ చంద్ర పునేఠ మాట్లాడుతూ, తమ రాష్ట్ర పరిధిలో జరుగుతున్న జంబ్లింగ్ పనులను నిర్దేశించిన లక్ష్యంలోగా పూర్తి చేస్తామని మోదీకి తెలిపారు.