asus zenfone 5z: ఆసుస్ జెన్ ఫోన్ 5జెడ్ ఆవిష్కరణ ముహూర్తం జూలై 4

  • ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్లోనే విక్రయాలు
  • దీనిపై ఫ్లిప్ కార్ట్ లో నోటిఫికేషన్
  • ధరలపై అదే రోజు స్పష్టత

ఆసుస్ కంపెనీ జెన్ ఫోన్ 5జెడ్ మోడల్ ను జూలై 4న భారత మార్కెట్లో విడుదల చేయబోతోంది. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనిపై ఫ్లిప్ కార్ట్ తన వెబ్ సైట్లో నోటిఫికేషన్ పోస్ట్ చేసింది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లోనే అమ్మకానికి రానుంది.

ఈ ఫోన్లో అత్యాధునిక క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 845 ఎస్ వోసీ, 6.2 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే, 19:9 యాస్పెక్ట్ రేషియో, 3,300 ఎంఏహెచ్ బ్యాటరీ 12 మెగా పిక్సల్స్ 8 మెగా పిక్సల్స్ ప్రైమరీ కెమెరాలు, ముందు భాగంలో 8 మెగాపిక్సల్స్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి.  అయితే, దీని ధర ఎంతన్నది ఇంకా ప్రకటించలేదు. తైవాన్ లో అయితే, 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ మోడల్ ధర మన కరెన్సీలో చూస్తే రూ.33,700గా ఉండగా, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.38,200గా ఉంది.

  • Loading...

More Telugu News