D Srinivas: నేడు డీఎస్ పై వేటు వేయనున్న టీఆర్ఎస్ నాయకత్వం!

  • టీఆర్ఎస్ కు క్రమంగా దూరమైన డీఎస్
  • డీఎస్ కు వ్యతిరేకంగా ఏకమైన నిజామాబాద్ నేతలు
  • నేడు కీలక నిర్ణయం తీసుకోనున్న కేసీఆర్

ఉమ్మడి రాష్ట్ర మాజీ పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుతం తెరాస నేతగా ఉన్న డి.శ్రీనివాస్ పై నేడు టీఆర్ఎస్ నాయకత్వం వేటు వేయనుందని తెలుస్తోంది. డీఎస్ కుమారుడు గత సంవత్సరం సెప్టెంబర్ లో బీజేపీలో చేరిన తరువాత, టీఆర్ఎస్ కు క్రమంగా దూరమవుతూ వస్తున్న ఆయనపై నిజామాబాద్ జిల్లా నాయకత్వం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ ఉదయం నుంచీ ఎంపీలు, ఎమ్మెల్యేల సమావేశం కొనసాగుతుండగా, డీఎస్ తీరు సరిగ్గా లేదని, ఆయనపై వేటు వేయాలన్న డిమాండ్ చర్చకు వచ్చింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని గత కొంతకాలంగా డీఎస్ పై ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో కేసీఆర్ సైతం ఇటీవలి కాలంలో డీఎస్ కు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో నేడు ఆయన్ను పార్టీ నుంచి, సలహాదారు పదవి నుంచి తొలగిస్తూ పార్టీ అధిష్ఠానం నుంచి ప్రకటన వెలువడుతుందని సమాచారం.

More Telugu News