Hyderabad: భార్య అందంపై భర్త సూటిపోటి మాటలు... కిరోసిన్ పోసుకుని యువతి ఆత్మహత్య!

  • భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్య
  • హైదరాబాద్, చందానగర్ లో ఘటన
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు
నిత్యమూ టీవీల్లో సినిమాలు, సీరియల్స్ ను చూపించి "ఆ హీరోయిన్ లా లేవు, ఈ హీరోయిన్ లా లేవు" అంటూ సూటిపోటి మాటలతో వేధిస్తుండటంతో ఓ అభాగ్యురాలు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ శివారు, చందానగర్ లో జరిగిన ఈ ఘటన గురించి పోలీసులు వెల్లడించిన వివరాలు...

శేరిలింగంపల్లి గోపీనగర్ ప్రాంతానికి చెందిన నవీన్ కు నాలుగేళ్ల క్రితం వీణతో వివాహం కాగా, వీరికి రెండేళ్ల కుమార్తె ఉంది. గత కొన్నాళ్లుగా భర్త వేధింపులు అధికం కావడంతో ఆమె తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. వారు సర్దిచెప్పి తిరిగి భర్త దగ్గర దింపి వెళ్లారు. ఆపైనా అతనిలో మార్పు రాకపోగా, వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో 22వ తేదీన ఆమె తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ ఘటనలో గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించగా, నిన్న ప్రాణాలు వదిలింది. నవీన్ కుమార్ పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.
Hyderabad
Police
Sucide
Kirosin
Burns
Harrasment

More Telugu News