central govenment: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. ఓవర్ టైమ్ అలవెన్స్ నిలిపివేస్తూ నిర్ణయం

  • ఏడో వేతన సంఘం సిఫారసులకు అనుగుణంగా నిర్ణయం
  • ఆపరేషనల్ స్టాఫ్ కు మాత్రం మినహాయింపు
  • పర్సనల్ మినిస్టరీ ఆదేశాలు

ఏడో వేతన సంఘం సిఫారసులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అదనపు సమయం పని చేస్తే ఇచ్చే భత్యం (ఓవర్ టైమ్ అలవెన్స్) ను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు పర్సనల్ మినిస్టరీ ఆదేశాలు జారీ చేసింది. అయితే, ముఖ్యమైన ప్రజా అవసరాల మేరకు పని చేసే కొన్ని సంస్థల ఉద్యోగులకు (ఆపరేషనల్ స్టాఫ్) మాత్రం దీని నుంచి మినహాయింపు నిచ్చింది.

ఆయా సంస్థల్లో పనులు సజావుగా సాగేందుకు వివిధ మంత్రిత్వ శాఖలకు చెందని, నాన్-గెజిటెడ్ ఆపరేషనల్ స్టాఫ్ కు మాత్రమే దీని నుంచి మినహాయింపు నిచ్చినట్టు పర్సనల్ మినిస్ట్రీ పేర్కొంది. బయో మెట్రిక్ హాజరు విధానం ద్వారా ఆపరేషనల్ స్టాఫ్ కు ఓవర్ టైమ్ అలవెన్స్ భత్యాలను అందించనున్నట్టు చెప్పింది. ఏయే విభాగాల ఉద్యోగులు ఆపరేషనల్ స్టాఫ్ పరిధిలోకి వస్తారో ఓ జాబితా తయారు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు పంపామని, ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు ఓవర్ టైమ్ అలవెన్స్ ను నిలిపివేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది.

  • Loading...

More Telugu News