Chandrababu: కాపులకు పూర్తి న్యాయం చేసింది చంద్రబాబే: చినరాజప్ప

  • రైతులకు అన్యాయం జరిగింది వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే
  • ఏపీకి జరిగిన అన్యాయంపై చంద్రబాబు పోరాడుతున్నారు
  • వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసే పార్టీ వైసీపీ

కాపు కులస్తులకు పూర్తి న్యాయం చేసింది సీఎం చంద్రబాబేనని ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రైతులకు అన్యాయం జరిగింది వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనేనని, తమ హయాంలో రైతులకు సకాలంలో సాగునీరు, సబ్సిడీలు, గిట్టుబాటు ధరలు కల్పించామని చెప్పారు.

కాపుల రిజర్వేషన్లపై కనీసం వినతిపత్రం కూడా తీసుకోని వారు కూడా తమపై నిందలు వేస్తారా? అని మండిపడ్డారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రధానితో చంద్రబాబు పోరాడుతున్నారని, ఏపీకి రావాల్సిన వాటిని సాధించి తీరుతారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసే పార్టీ వైసీపీ అని జోస్యం చెప్పారు. బీజేపీతో కలిసి పోటీ చేసే పార్టీలను ప్రజలు తుంగలో తొక్కడం ఖాయమని, ఈ నెల 29న కాకినాడలో జరిగే ధర్మ పోరాట దీక్షకు లక్ష మంది తరలివస్తారని చెప్పారు.

  • Loading...

More Telugu News