rana: రానా హీరోగా తరుణ్ భాస్కర్ మూవీ!

  • 'హాథీ మేరే సాథీ'తో రానా నెక్ట్స్ మూవీ
  • నెక్స్ట్ మూవీ 'కోడి రామ్మూర్తి' బయోపిక్
  • తరువాత చిత్రం సొంత బ్యానర్లో  

సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వరుసగా మూడు సినిమాలు చేయడానికి దర్శకుడు తరుణ్ భాస్కర్ ఒప్పందం చేసుకున్నాడు. ఈ కాంబినేషన్లో మొదటి సినిమాగా ఈ నెల 29వ తేదీన 'ఈ నగరానికి ఏమైంది?' అనే సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

ఈ సినిమా తరువాత సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తరుణ్ భాస్కర్ మరో సినిమాను చేయనున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు. ఈ బ్యానర్లో మూడవ సినిమాను రానాతో చేయనున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం రానా 'హాథీ మేరే సాథీ' సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత ఆయన 'కోడి రామ్మూర్తి' బయోపిక్ ను చేయనున్నాడు. ఈ ప్రాజెక్టును పూర్తిచేసిన తరువాత తరుణ్ భాస్కర్ తో కలిసి రానా సెట్స్ పైకి వెళతాడన్నమాట.      

More Telugu News