ramaprabha: నిజజీవితంలోను కృష్ణగారు సూపర్ స్టారే: రమాప్రభ

  • కృష్ణగారి వ్యక్తిత్వం గొప్పది 
  • ఆయన మనసు చాలా సున్నితం 
  • ఎవరినీ నొప్పించేవారు కాదు
తెలుగు తెరపై హాస్యనటిగా రమాప్రభ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎంతోమంది అగ్రహీరోల సినిమాల్లో ఆమె తనదైన మార్కును చూపించారు. ఇంతమంది గొప్ప ఆర్టిస్టులతో కలిసి నటించడం తన పూర్వజన్మ సుకృతమంటూ తాజా ఇంటర్వ్యూలో రమాప్రభ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంలోనే ఆమె సూపర్ స్టార్ కృష్ణగారి గురించి ప్రస్తావించారు.

"కృష్ణగారు తెరపైనే కాదు .. నిజజీవితంలోను సూపర్ స్టారే. సాధ్యమైనంత వరకూ ఏ విషయంలోను ఆయన ఎవరినీ నొప్పించేవారు కాదు. ఏ విషయంలోనైనా ఆయన ఎంతో సాహసంతో నిర్ణయాలు తీసుకునేవారు. ఆయన మనసు సున్నితమైనది .. వ్యక్తిత్వం గొప్పది. ఎవరైనా ఆపదలో వుంటే వెంటనే స్పందించే తత్వం ఆయనది. రాష్ట్రంలో విపత్తులు జరిగిన చాలా సందర్భాల్లో ఆయన తనవంతు సాయాన్ని ప్రభుత్వం ద్వారా అందించారు. ఇంతటి మంచి మనసున్న గొప్ప గొప్ప వ్యక్తులతో కలిసి నటించడం నా అదృష్టం" అంటూ ఆమె ఆనందాన్ని వ్యక్తం చేశారు.     
ramaprabha

More Telugu News