railway: రైళ్లలోని దుప్పట్లను ఇకపై నెలలో రెండు సార్లు ఉతుకుతారట!

  • ఏసీ కోచ్ లలో దుప్పట్లపై రైల్వే నిర్ణయం
  • సీనియర్ అధికారికి పర్యవేక్షణ బాధ్యతలు
  • ఇక మీదట నైలాన్, ఊలెన్ మిక్స్ దుప్పట్లు కొనాలని నిర్ణయం

ఏసీ కోచ్ లలో ప్రయాణికులకు ఇచ్చే దుప్పట్లను ఇక మీదట నెలలో రెండు సార్లు ఉతకాలని భారతీయ రైల్వే  నిర్ణయించింది. ప్రస్తుతం రెండు నెలలకు ఒకసారే ఉతుకుతున్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా వెల్లడించింది. అయితే, ఖర్చు కోణంలోనే రైల్వే ఇప్పటి వరకు రెండు నెలలకోసారి ఉతుకుతోంది. ఇలా చేస్తే ఒక్కో దుప్పటి నాలుగేళ్ల పాటు మన్నికగా ఉంటోంది. నెలలో రెండు సార్లు ఉతకడం వల్ల దుప్పటి మన్నిక కూడా రెండేళ్లకు తగ్గనుంది.

ఇక సవరించిన నిబంధనల మేరకు కొత్తగా కొనే దుప్పట్లు ఊలెన్, నైలాన్ తో తయారైనవి ఉంటాయి. ఇప్పుడున్నవి దుర్వాసన వస్తున్నాయనే ఫిర్యాదులు రావడంతో ఈ మార్పు చేసింది. దీనివల్ల దుప్పట్ల కొనుగోలు ఖర్చు రెట్టింపు కానుంది. క్రమం తప్పకుండా దుప్పట్లను ఉతికేలా చూసే బాధ్యతను సీనియర్ రైల్వే అధికారి పర్యవేక్షిస్తారు. 

More Telugu News