Facebook: ఫేస్ బుక్ లో ఆమె అందం చూసి మతిపోయింది: శైలజను హత్య చేసిన ఆర్మీ మేజర్

  • తోటి మేజర్ భార్యతో వివాహేతర సంబంధం
  • సంబంధాన్ని కొనసాగించేందుకు ఇష్టపడని శైలజ
  • దారుణంగా హత్య చేసిన నిఖిల్ హండా
మరో ఆర్మీ మేజర్ భార్య శైలజా ద్వివేదిని హత్య చేసిన కేసులో ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న ఆర్మీ మేజర్ నిఖిల్ రాయ్ హండా, విచారణలో పలు కీలక విషయాలను వెల్లడించినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. శైలజతో తనకున్న వివాహేతర సంబంధం, ఆమెతో పరిచయం గురించి నిఖిల్ పోలీసులకు వెల్లడించాడు. మూడేళ్ల క్రితం తాను నాగాలాండ్ ఆర్మీ క్యాంప్ లో పని చేస్తున్న సమయంలో ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా శైలజ ఫేస్ బుక్ లో పరిచయమైందని చెప్పాడు.

ఆమె అందం చూసి తనకు మతిపోయిందని, ఆపై ఆమెతో స్నేహం చేశానని వెల్లడించాడు. అంతకన్నా ముందు శైలజ భర్త అమిత్ ద్వివేదితో స్నేహం చేశానని, ఆపై తరచూ వారింటికి వెళ్లి శైలజతో పరిచయం పెంచుకున్నానని చెప్పుకొచ్చాడు. ఆమెకు దగ్గరయ్యేందుకు తన భార్యతో విభేదాలు ఉన్నట్టు చెప్పానని, తన పరిచయాన్ని శారీరక బంధంగా మార్చుకున్నానని, అమిత్ కు విడాకులు ఇవ్వాలని తాను కోరితే శైలజ నిరాకరించిందని చెప్పాడు. తనతో వివాహేతర సంబంధం కూడా ఆమె వద్దనుకుందని, ఆ కారణంతోనే హత్య చేశానని పోలీసుల ఇంటరాగేషన్ లో నిఖిల్ చెప్పాడు. పోలీసుల ఇంటరాగేషన్ కొనసాగుతోంది.
Facebook
Army Major
Nikhil Hunda
Shailaza Dwivedi

More Telugu News