ఎట్టి పరిస్థితుల్లోనూ దీక్ష కొనసాగించరాదు... సీఎం రమేష్ కు స్పష్టం చేసిన డాక్టర్లు
- ఏడవ రోజుకు చేరుకున్న సీఎం రమేష్ దీక్ష
- తోడుగా దీక్ష చేస్తున్న బీటెక్ రవి
- అపస్మారక స్థితిలోకి వెళ్లే ప్రమాదం
- ఆసుపత్రులకు తరలించాలని అధికారులకు సిఫార్సు
వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ దీక్షను కొనసాగించరాదని, మరో రోజు ఆహారం తీసుకోకుంటే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయే ప్రమాదముందని వైద్యులు తెలిపారు. వెంటనే వీరిని ఆసుపత్రులకు తరలించాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేయనున్నట్టు తెలిపారు.