Hyderabad: లైసెన్స్ లేకుండా డ్రైవింగ్.. 78 మందికి జైలు, జరిమానా!

  • లైసెన్స్ లేని వారికి ఐదు రోజుల జైలు శిక్ష, జరిమానా
  • సెల్‌ఫోన్ మాట్లాడుతూ పట్టుబడిన వారికి ఐదు రోజులు
  • మద్యం తాగి పట్టుబడిన వారికి 16 రోజుల జైలు శిక్ష

లైసెన్స్ లేకుండా వాహనాలను నడుపుతున్న వారు రోజురోజుకు పెద్ద సంఖ్యలో పట్టుబడుతున్నారు. వీరిలో మైనర్లు కూడా ఉండడం ట్రాఫిక్ పోలీసులను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా పట్టుబడిన 78 మందికి జరిమానా, జైలు శిక్ష విధిస్తూ కూకట్‌పల్లి 9వ మెట్రోపాలిటన్‌ కోర్టు తీర్పు చెప్పింది.

శిక్ష పడిన వారిలో ఆరుగురు మైనర్లు కూడా ఉన్నారు. వీరిని గాజులరామారంలోని జువైనల్ హోంకు తరలించారు. మిగతా 72 మందికి మేజిస్ట్రేట్ దుర్గాప్రసాద్ ఐదు రోజుల జైలు శిక్షతోపాటు వాహన యజమానులకు రూ.500 జరిమానా విధించారు. మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతూ వాహనాలు నడిపిన 17 మందికి ఐదు రోజుల చొప్పున జైలు శిక్ష విధించగా, మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 22 మందికి రెండు రోజుల నుంచి 16 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.

More Telugu News