Asaduddin Owaisi: ముస్లింలు అందరూ ముస్లింలకే ఓటు వేయండి.. 70 ఏళ్లుగా మనల్ని వాడుకున్నారు: అసదుద్దీన్ ఒవైసీ

  • ముస్లింలు పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది
  • రాజకీయ శక్తిగా మనం అవతరించాలి
  • సెక్యులరిజం కావాలని కోరుకుంటే.. ముస్లింలకే ఓటు వేయండి

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో సెక్యులరిజం బతికి ఉండాలంటే... ముస్లింలు అందరూ ముస్లింలకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ముస్లింలంతా కలసికట్టుగా పోరాడాలని, సొంత మతానికి చెందిన వారికే ఓటు వేయాలని అన్నారు.

 "ఖాసిం చావు మనందరిని ఆలోచించేలా చేసింది. కన్నీరు కార్చండని నేను మిమ్మల్ని అడగటం లేదు. ధైర్యంగా నిలబడాలని హెచ్చరిస్తున్నా. సెక్యులరిజం గురించి మాట్లాడుతున్నవారంతా పెద్ద డెకాయిట్లు, అవకాశవాదులు. వీళ్లంతా 70 ఏళ్ల పాటు ముస్లింలను వాడుకున్నారు. మనం నోరు మూసుకుని ఉండేలా ఒత్తిడి చేశారు.

ఇప్పుడు మీ హక్కుల కోసం మీరు పోరాడాల్సిన సమయం వచ్చింది. సెక్యులరిజం కావాలని మీరు కోరుకుంటే... మీ కోసం మీరు పోరాడండి. రాజకీయశక్తిగా అవతరించండి. మీ అభ్యర్థులు గెలిచేలా యత్నించండి" అంటూ ఒవైసీ అన్నారు. హైదరాబాదులో జరిగిన ఒక సభలో ఆయన మాట్లాడుతూ, ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై ఒవైసీ మండిపడ్డారు. దేశంలో ముస్లింలపై దాడులు జరుగుతున్నా... చర్యలు లేవని విమర్శించారు. మీరు చెప్పే 'సబ్ కా సాత్, సబ్ కా వికాస్' అంటే ఇదేనా? అంటూ నిలదీశారు.

ఉత్తరప్రదేశ్ లోని బజేరా ఖుర్ద్ గ్రామంలో గోవులను చంపుతున్నారన్న అనుమానంతో ఖాసిం (38) అనే వ్యక్తిని కొందరు కొట్టి చంపారు. ఇదే ఘటనలో షమీయుద్దీన్ (65) అనే వ్యక్తిని చితకబాదారు. ఈ ఘటననే ఒవైసీ తన ప్రసంగంలో ఉటంకించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు హిందూ ఓటు బ్యాంకు కోసమే ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.

  • Loading...

More Telugu News