sumanth: ఆసక్తిని రేపుతోన్న 'ఇదం జగత్' .. ఫస్టులుక్ రిలీజ్

  • సుమంత్ హీరోగా 'ఇదం జగత్'
  • మరింత హ్యాండ్సమ్ గా సుమంత్ 
  • దర్శకుడిగా అనిల్ శ్రీకంఠం

సుమంత్ తన కెరియర్ ను మొదలుపెట్టి చాలాకాలం అయింది. కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ వస్తున్నా, ఆయనకి సక్సెస్ అనేది దూరంగానే ఉండిపోతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన మరో వైవిధ్యభరితమైన కంటెంట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు .. ఆ సినిమా పేరే ..  'ఇదం జగత్'. పద్మావతి .. శ్రీధర్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి అనిల్ శ్రీకంఠం దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. రాత్రివేళలో సిటీలోని ఓ రోడ్డుపై కెమెరా పట్టుకుని సుమంత్ కనిపిస్తున్నాడు. ఓ మరణానికి సంబంధించిన ఆధారాలను సేకరించే పనిలో ఆయన ఉన్నాడనే విషయం ఈ పోస్టర్ ద్వారా తెలుస్తోంది. అలా ఈ పోస్టర్ అందరిలోను ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో సుమంత్ మరింత హ్యాండ్సమ్ గా కనిపించనున్నాడనేది ఈ పోస్టర్ ను బట్టి తెలుస్తోంది. ఈ సినిమా అయినా సుమంత్ కి సక్సెస్ ను అందిస్తుందేమో చూడాలి.    

  • Loading...

More Telugu News