epfo: కనీస పింఛను రూ.2,000... వ్యవస్థీకృత రంగంలో పనిచేసిన వారికి త్వరలో శుభవార్త

  • ప్రస్తుతం కనీస పింఛనుగా రూ.1,000
  • ఇది సరిపోదన్న నిపుణుల కమిటీ
  • కనీసం రూ.2,000గా వెంటనే ప్రకటించాలని ప్రభుత్వానికి సూచన
  • త్వరలో దీనిపై ప్రభుత్వం నిర్ణయం

వ్యవస్థీకృత రంగంలోని ప్రైవేటు కంపెనీల్లో పనిచేసి, ఈపీఎఫ్ వో సభ్యులుగా చందాలు చెల్లించి పదవీ విరమణ చేసిన వారికి త్వరలో మంచి రోజులు రానున్నాయి. కనీస పింఛనుగా వారు ఇప్పుడు రూ.1,000 పొందుతుండగా, రూ.2,000 చెల్లించే అవకాశాలున్నాయి ఎందుకంటే ఈ అంశంపై అధ్యయనానికి ప్రభుత్వం  నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ ప్రస్తుతమున్న కనీస పింఛను రూ.1,000ను చాలా తక్కువ మొత్తమని భావిస్తోంది. అయితే, దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

పదవీ విరమణ చేసిన కార్మికుల కనీస పింఛను మొత్తాన్ని పెంచాలన్న అభిప్రాయం ఎప్పటి నుంచో ఉంది. ‘‘ కనీస పింఛను రూ.2,000గా వెంటనే ప్రకటించాలని ప్రభుత్వానికి సూచించడం జరిగింది. దీన్ని రూ.5,000కు పెంచడం అన్నది తర్వాత కాలంలో పరిశీలించడం జరుగుతుంది. ప్రభుత్వంపై బాధ్యత ఉంది, కనుక పేద కార్మికులకు కనీస పింఛను పెంచాల్సి ఉంది’’ అని ఈపీఎఫ్ వో బోర్డు సభ్యుడు విగ్ అన్నారు. అయితే, ఇప్పుడున్న కనీస పింఛను రూ.1,000ని రెట్టింపు లేదా మూడు రెట్లు చేసే ప్రతిపాదన కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉందని సమాచారం.

More Telugu News