lakshmi menon: పెళ్లి చేసుకోను.. అయినా నా జీవితంలో ఒక వ్యక్తి ఉంటాడు: లక్ష్మీమీనన్

  • నా జీవితంలో కచ్చితంగా ఒకరు ఉంటారు
  • దాన్ని సహజీవనం అని చెప్పలేను
  • పెళ్లి చేసుకోకపోయినా ప్రేమ, అభిమానం పొందవచ్చు
15 ఏళ్ల వయసులోనే సినీ రంగంలో అడుగుపెట్టి, సక్సెస్ ఫుల్ నటిగా గుర్తింపు పొందిన లక్ష్మీమీనన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. వివాహబంధంపై తనకు నమ్మకం లేదని... పెళ్లి చేసుకోనంటూ ఆమె స్పష్టం చేసింది. అలాగని, తన జీవితంలో అండగా ఎవరూ ఉండరని అనుకోవద్దని చెప్పింది. తన జీవితంలో కచ్చితంగా ఒకరు ఉంటారని... అతనికి చాలా నమ్మకం, ప్రేమాభిమానాలు ఉండాలని తెలిపింది. అయితే, దాన్ని సహజీవనం అని కూడా చెప్పలేనని అంది. దాన్ని ఎలా వర్ణించాలో తనకు అర్థం కావడం లేదని చెప్పింది. పెళ్లి చేసుకుంటేనే ప్రేమ, అభిమానం లభిస్తాయని తాను భావించడం లేదని... పెళ్లి చేసుకోకపైనా వాటిని పొందవచ్చని తెలిపింది.
lakshmi menon
actress
marriage

More Telugu News