Donald Trump: అక్రమంగా అమెరికాలో అడుగు పెడితే వెంటనే వెనక్కి పంపించేస్తాం: ట్రంప్

  • న్యాయపరమైన విచారణ ప్రక్రియలు ఏవీ ఉండవు
  • మా దేశంలోకి చొరబడేందుకు అనుమతించం
  • వలసవాదులకు ఎటువంటి విచారణ వుండదు 

అమెరికాలో చట్ట విరుద్ధంగా అడుగు పెట్టిన వారిని ఎటువంటి విచారణలు, న్యాయ ప్రక్రియలు లేకుండా వెంటనే వెనక్కి పంపించేస్తామని ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే, ట్రంప్ వ్యాఖ్యలను న్యాయ నిపుణులు, వలసవాదుల హక్కుల సంస్థలు తప్పుబట్టాయి. అమెరికా రాజ్యాంగానికి ఇది విరుద్ధమని పేర్కొన్నారు. ఆదివారం ట్రంప్ వరుస ట్వీట్లు చేశారు.

‘‘ఈ ప్రజలందరినీ మా దేశంలోకి చొరబడేందుకు మేం అనుమతించం. ఎవరైనా ప్రవేశిస్తే న్యాయమూర్తులతో పని లేకుండా లేదా కోర్టు కేసుల్లేకుండా ఎక్కడి నుంచి అయితే వచ్చారో, తిరిగి అక్కడికే పంపించేస్తాం. మా దేశంలోకి చొచ్చుకురావడానికి ప్రయత్నిస్తామంటే కుదరదు’’ అని ట్వీట్ చేశారు. రాజకీయ  ఆశ్రయానికి ముగింపు పలకాలని అధ్యక్షుడు బలంగా ప్రతిపాదించారని, వలసవాదులకు ఎటువంటి విచారణ ప్రక్రియ ఉండదని న్యాయ నిపుణుడు షెరిలిన్ ఇఫిల్ పేర్కొన్నారు.

More Telugu News