subhalekha sudhakar: 'సప్తపది' సమయంలో విశ్వనాథ్ గారిని కలిశాను .. కానీ ఎంపిక కాలేదు: శుభలేఖ సుధాకర్
- ఆరంభంలో అవకాశాల కోసం కష్టపడ్డాను
- విశ్వనాథ్ గారిని కలిశాను
- ఆయన నన్ను తదేకంగా చూశారు
ఎన్నో విభిన్నమైన కథా చిత్రాలలో విలక్షణమైన పాత్రలను పోషిస్తూ నటుడిగా శుభలేఖ సుధాకర్ తన సత్తా చాటుకున్నారు. తాజాగా ఆయన 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. "అందరిలానే సినిమాల్లో అవకాశాల కోసం ఆరంభంలో నేను చాలా ఇబ్బందులు పడ్డాను.
అవి విశ్వనాథ్ గారు 'సప్తపది ' సినిమా చేయడానికి రెడీ అవుతోన్న రోజులు. ఆ సమయంలో లక్ష్మీ దేవదాస్ కనకాల గారు నా గురించి ఆయనకి చెప్పారు. మర్నాడు ఆఫీసుకి వచ్చి కలవమని ఆ సినిమా టీమ్ సభ్యులు చెబితే .. వెళ్లి కలిశాను. విశ్వనాథ్ గారు నన్ను తదేకంగా చూశారు .. కానీ ఆ సినిమాకి ఆయన నన్ను సెలెక్ట్ చేయలేదు. అందుకు కారణం ఆయన అనుకున్న పాత్రకి నేను సూట్ కానని కావొచ్చు. ఆ తరువాత చేసిన 'శుభలేఖ' సినిమాకి మాత్రం పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చారు" అని చెప్పుకొచ్చారు.