దీక్షను విరమించకుంటే ప్రమాదం: సీఎం రమేష్ తో డాక్టర్లు
- ఆరో రోజుకు చేరిన దీక్ష
- బరువు తగ్గుతున్నారన్న డాక్టర్లు
- ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని వెల్లడి
ఇద్దరూ చాలా నీరసంగా ఉన్నారని చెప్పిన డాక్టర్లు, ఉన్నతాధికారులకు వెంటనే తమ నివేదికను పంపించనున్నట్టు తెలిపారు. వీరు ఫ్లూయిడ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందని, లేకుంటే దీక్ష ప్రభావం శరీరంలోని అవయవాలపై పడుతుందని అన్నారు. కాగా, కడప స్టీల్ ప్లాంటుపై కేంద్రం స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని, వెంటనే ప్లాంటును మంజూరు చేయాలని, అప్పటివరకూ తన దీక్ష కొనసాగుతుందని సీఎం రమేష్ వెల్లడించారు.