Andhra Pradesh: నాడు టీడీపీ-బీజేపీకి సహకరించాను... నేడు సొంతంగా వస్తున్నా!: పవన్ కల్యాణ్

  • 2019లో సమతుల్యత అవసరం
  • పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన పవన్ కల్యాణ్
  • ట్విట్టర్ లో వెల్లడి
"2014 ఎన్నికలలో తెలుగు ప్రజల సుస్థిరత కోసం సహకారం అందించాం. 2019 ఎన్నికలలో సమతుల్యత కోసం పోటీ చేస్తున్నాం" అని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కొద్దిసేపటి క్రితం తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందే 'జనసేన'ను ప్రకటించిన పవన్, అప్పట్లో తెలుగుదేశం - బీజేపీ కూటమికి మద్దతు పలికిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర విభజన తరువాత జరిగిన నాటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని సొంతం చేసుకుంది.  

ఆపై ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కేంద్రం ఇవ్వకపోవడం, కీలకమైన విభజన హామీలైన విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్ విషయాల్లోనూ ముందడుగు పడకపోవడంతో బీజేపీ, తెలుగుదేశం తమ పొత్తును తెగదెంపులు చేసుకున్నాయి. ఇక తన జనసేన పార్టీని గ్రామగ్రామాలకూ విస్తరించే పనిలో భాగంగా, ఇప్పటికే జిల్లా సభ్యులను ఎంపిక చేసుకున్న పవన్, ప్రజల్లో పర్యటిస్తూ, వారి సమస్యలను తెలుసుకునే పనిలో ఉన్నారు. వచ్చే సంవత్సరం ఎన్నికల్లో స్వయంగా పోటీపడాలన్నది పవన్ అభిమతం.
Andhra Pradesh
Pawan Kalyan
Jana Sena
Telugudesam
YSRCP

More Telugu News