fifa: ఫుట్ బాల్ ప్రపంచ కప్ తో టీవీ కంపెనీలకు కాసుల వర్షం

  • పెరిగిన అమ్మకాలు
  • కంపెనీల విస్తృత ప్రచారం
  • కొత్త మోడళ్ల విడుదల
  • ఈఎంఐ విధానంలో కొనుగోలుకు అవకాశం

ఫిఫా వరల్డ్ కప్ నేపథ్యంలో సోనీ, ఎల్జీ, శామ్ సంగ్, మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్ కంపెనీల టీవీల విక్రయాలు పెరిగాయి. ఈ నెల, వచ్చే నెలలో అమ్మకాలను సాధ్యమైన మేర పెంచుకునేందుకు టీవీ కంపెనీలు కూడా పెద్ద ఎత్తున ప్రచారానికి ప్రణాళికను రూపొందించుకుని అమల్లో పెట్టాయి. నూతన శ్రేణి పెద్ద తెరలతో కూడిన టీవీలను విడుదల చేయడం ద్వారా కంపెనీలు ఫుట్ బాల్ అభిమానులకు గాలం వేశాయి. మైదానంలో కూర్చుని ఆటను వీక్షించిన అనుభవం కోసం ఫుట్ బాల్ ప్రేమికులు సైతం పెద్ద స్క్రీన్లతో కూడిన టీవీల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ధర ఎక్కువైనా ఈఎంఐ విధానంలో కొనుగోలు చేసుకునేందుకు కంపెనీలు అవకాశం కల్పించాయి.

కేరళ, గోవా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలతో పాటు ఢిల్లీ ఎన్ సీఆర్, బెంగళూరు, ముంబై మెట్రోల్లో గత ఏడాది కాలంలో తమ కంపెనీ టీవీ అమ్మకాలు రెట్టింపయ్యాయని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా బిజినెస్ హెడ్ రిషి టాండన్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే గడిచిన రెండు నెలల కాలంలో తమ టీవీల అమ్మకాలు 15 శాతం పెరిగాయని మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు రాజేష్ అగర్వాల్ తెలిపారు.

More Telugu News