vijay: అమెరికా వెళుతోన్న 'సర్కార్' .. భారీస్థాయిలో ఇంట్రో సాంగ్

  • విజయ్ హీరోగా 'సర్కార్'
  • 80 శాతం షూటింగ్ పూర్తి 
  • 20 శాతం షూటింగ్ అమెరికాలో

విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో 'సర్కార్' సినిమా రూపొందుతోంది. కీర్తి సురేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమా, ఇప్పటికే 80 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకుంది. మిగతా 20 శాతం చిత్రీకరణ అమెరికాలో జరగనుందని చెప్పారు. ముందుగా లాస్ వేగాస్ లో విజయ్ ఇంట్రో సాంగ్ ను ప్లాన్ చేశారట. విజయ్ క్రేజ్ కి .. పాత్ర రేంజ్ కి తగినట్టుగా ఈ ఇంట్రో సాంగ్ ను చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 విజయ్ అభిమానుల చేత విజిల్స్ వేయించేలా .. ఇంతవరకూ విజయ్ చేసిన ఇంట్రో సాంగ్స్ కి మించి ఈ సాంగ్ ఉండేలా చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా దీపావళికి విడుదల చేయనున్నట్టు చెబుతున్నారు. గతంలో విజయ్ .. మురుగదాస్ కాంబినేషన్లో వచ్చిన 'కత్తి' .. 'తుపాకి' బ్లాక్ బస్టర్ మూవీస్ గా నిలిచాయి. ఆ జాబితాలో 'సర్కార్' కూడా చేరుతుందనే నమ్మకంతో ఫ్యాన్స్ వున్నారు.    

More Telugu News