murali mohan: నన్ను క్షమించమని వేంకటేశ్వరస్వామిని మొక్కుకున్నా: మురళీమోహన్

  • వెంకన్న స్వామిని పొరపాటున వెంకన్న చౌదరి అన్నాను
  • పొరపాటు జరిగింది.. మన్నించు స్వామి అని వేడుకున్నా
  • బీజేపీతో వైసీపీకి చీకటి ఒప్పందం ఉంది
గతంలో ఓ సందర్భంలో మాట్లాడుతూ వెంకన్నస్వామి అనబోయి పొరపాటున వెంకన్న చౌదరి అన్నానని టీడీపీ ఎంపీ మురళీమోహన్ మళ్లీ పశ్చాత్తాపం వక్తం చేశారు. చేసిన పొరపాటును క్షమించాలని వెంకన్నను కోరుకున్నానని చెప్పారు. పొరపాటు జరిగింది, మన్నించు స్వామీ అంటూ వేడుకున్నానని తెలిపారు.

ఇక వైసీపీ ఎంపీల రాజీనామాలు ఒక నాటకమని... రాజీనామాలు చేసిన 75 రోజుల తర్వాత వాటిని ఆమోదించడం ఓ రాజకీయ డ్రామా అని విమర్శించారు. ఉప ఎన్నికలకు వైసీపీ భయపడుతోందని... అందుకే బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. ఈ ఉదయం ఆయన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం, మీడియాతో మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు. 
murali mohan
Telugudesam
Tirumala
YSRCP

More Telugu News