Telangana: తెలంగాణ మంత్రి తలసానితో దానం నాగేందర్‌ కీలక భేటీ.. రేపు టీఆర్‌ఎస్‌లోకి?

  • కాంగ్రెస్‌కి రాజీనామా చేసిన దానం
  • రేపు అన్ని విషయాలు వెల్లడిస్తారన్న తలసాని
  • రేపు మధ్యాహ్నం 12గం.లకు ఫిలింనగర్‌లో మీడియా సమావేశం
మాజీ మంత్రి దానం నాగేందర్ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆయన తాజాగా హైదరాబాద్‌లోని ఆదర్శ్‌నగర్‌ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను కలిసి చర్చించారు. దానం నాగేందర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ విషయం గురించి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడుతూ.. అన్ని విషయాలను రేపు మధ్యాహ్నం మీడియా సమావేశంలో దానం నాగేందర్‌ వెల్లడిస్తారని అన్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఫిలింనగర్‌లోని ఫిల్మ్‌-ఏ జంక్షన్‌ వద్ద ఈ మీడియా సమావేశం ఉంటుంది.   
Telangana
danam nagendar
TRS

More Telugu News