aicc: ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణలో కీలకమార్పులు

  • ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణలో కీలకమార్పులు
  • పలు రాష్ట్రాలకు పార్టీ బాధ్యులు, ఏఐసీసీ కార్యదర్శుల నియామకం
  • తాజా జాబితాను విడుదల చేసిన అశోక్ గెహ్లాట్

ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కీలకమార్పులు చేశారు. వివిధ రాష్ట్రాలకు పార్టీ బాధ్యులు, ఏఐసీసీ కార్యదర్శుల నియామకం చేపట్టారు. తాజా నియామకాలకు సంబంధించిన జాబితాను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ విడుదల చేశారు.

ఏఐసీసీ కార్యదర్శిగా జేడీ శీలంను, ఏపీకి తమిళనాడు రాష్ట్రానికి చెందిన క్రిస్టోఫర్ తిలక్, సీడీ మెయ్యప్పన్ లను ఏఐసీసీ కార్యదర్శులుగా, మహారాష్ట్రకు ఏఐసీసీ కార్యదర్శులుగా సోనల్ పటేల్, అశోక్ దువా, సంపత్ కుమార్ లను, ఏఐసీసీ సంయుక్త కార్యదర్శిగా శశికాంత్ శర్మ, కార్యదర్శిగా మహేంద్ర జోషిని, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా లోక్ సభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ను నియమించారు. మహారాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ బాధ్యతలను కూడా ఆయనకు అప్పగించారు.  

More Telugu News