time magazine: అమెరికా సరిహద్దుల్లో వెక్కి వెక్కి ఏడుస్తూ.. టైమ్ కవర్ పేజీకి ఎక్కిన మెక్సికో చిన్నారి

  • ఆ చిన్నారిని తల్లిదండ్రుల నుంచి వేరుచేయలేదు
  • స్పష్టం చేసిన ఆమె తండ్రి 
  • ట్రంప్ ఎదురుగా పాప ఉన్నట్టు ఫొటోను తీర్చిదిద్దిన టైమ్

మెక్సికో సరిహద్దుల నుంచి అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిని, వారి పిల్లలను వేర్వేరుగా ఉంచాలన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా అలా చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. తల్లిదండ్రులు, పిల్లలను ఒకేచోట ఉంచాలన్న నిర్ణయానికొచ్చారు. తల్లిదండ్రుల నుంచి పిల్లలను వేరు చేసి శిబిరాలకు తరలిస్తుండడంతో అమెరికా తీరుపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి.

ముఖ్యంగా మెక్సికో సరిహద్దుల్లో పింక్ కలర్ టాప్ తో ఉన్న రెండేళ్ల చిన్నారి వెక్కి వెక్కి ఏడుస్తున్న ఫోటో ప్రముఖంగా పత్రికల్లో రావడం తెలిసిందే. ఇప్పుడు ఇదే చిన్నారి ఫోటోను ట్రంప్ ఎదురుగా ఉన్నట్టు చిత్రీకరించి టైమ్ మ్యాగజైన్ తన తాజా సంచిక కవర్ పేజీపై ముద్రించింది. ట్రంప్ ఆ చిన్నారి వైపు చూస్తున్నట్టు ఉండగా, ఆ చిన్నారి ఏడుస్తూ ఉంది.

వెల్ కమ్ టు అమెరికా అనే క్యాప్షన్ పైన ఉంది. ట్రంప్ ఆ చిన్నారికి వెల్ కమ్ చెబుతున్నట్టుగా ఉంది. అయితే, తల్లిదండ్రుల నుంచి ఈ చిన్నారిని వేరు చేయడం వల్లే ఏడుస్తుందని భావించగా, అలాంటిదేమీ లేదని ఆమె తండ్రి డెనిస్ వలేరా స్పష్టం చేశాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హృదయాన్ని సైతం తమ చిన్నారి కదిలించిందన్నారు.

More Telugu News