Pawan Kalyan: కాబోయే భర్త చేస్తున్న మెసేజ్ లను చూడనివ్వట్లేదు... త్వరలోనే తన పెళ్లని చెప్పకనే చెప్పిన రేణూ దేశాయ్!

  • ఇటీవల ఓ చెయ్యి పట్టుకున్న ఫొటోను చూపిన రేణు
  • తాజాగా స్విమ్ సూట్ లో మెసేజ్ లు చూస్తున్న ఫొటో పోస్ట్
  • స్నేహితులు ప్రైవసీ ఇవ్వడం లేదని వ్యాఖ్య
ఇటీవల ఓ వ్యక్తి చెయ్యి పట్టుకుని ఉన్న ఫొటోను పోస్టు చేస్తూ, "నీతో ఉంటే సంతోషంగా, శాంతంగా ఉంటుంది. నా చెయ్యి ఎప్పటికీ విడువకు. ఆ నమ్మకాన్ని నువ్వు నాకు కల్పించావు" అని సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టిన పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్, తాజాగా తన వివాహం అతనితోనేనని చెప్పకనే చెప్పింది.

ప్రస్తుతం గోవాలో విహరిస్తున్న ఆమె, తన కాబోయే భర్త చేస్తున్న మెసేజ్ లను తన స్నేహితులు చూడనివ్వడం లేదని ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొంది. స్విమ్ సూట్ లో ఉన్న తను ఫోన్ లో మెసేజ్ లు చూస్తూ, ముసిముసి నవ్వులు నవ్వుతుండగా, స్నేహితులు తీసిన ఫొటోను అభిమానులతో పంచుకుంది. తన కాబోయే భర్త ఇచ్చే మెసేజ్ లను చదివే ప్రైవసీ కూడా తనకు కలగట్లేదని కామెంట్ చేసింది. ఈ పోస్టు చూసిన వారంతా రేణూ వివాహం త్వరలోనే జరగబోనుందని తేల్చేస్తున్నారు.
Pawan Kalyan
Renu Desai
Instagram
Swim Sute

More Telugu News