Guntur District: చాన్నాళ్ల తరువాత... నేడు ఒకే కార్యక్రమానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్!

  • నేడు గుంటూరు సమీపంలో దశావతార వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట
  • లింగమనేని టౌన్ షిప్ లో కార్యక్రమం
  • హాజరుకానున్న పలువురు ప్రముఖులు
చాలా రోజుల తరువాత ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఒకే చోట కలవనున్నారు. నేడు గుంటూరు సమీపంలో జరగనున్న దశావతార వెంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఇద్దరు నేతలూ హాజరుకానున్నారు. ఈ ఉదయం 11 గంటలకు ఆచార్య నాగార్జున యూనివర్శిటీ దగ్గర ఈ విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది.

ఇక్కడి లింగమనేని టౌన్ షిప్ పక్కనే ఈ నూతన దేవాలయ నిర్మాణం ఇటీవల పూర్తయింది. మైసూర్ దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ ఈ ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరు కానున్నారు. మొత్తం నాలుగు ఎకరాల్లో ఆలయాన్ని నిర్మించగా, గుడిలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇండియాలో దశావతార వెంకటేశ్వరస్వామి విగ్రహమున్న తొలి దేవాలయం ఇదే కానుంది.
Guntur District
Nagarjuna University
Chandrababu
Pawan Kalyan

More Telugu News