kurnool: ప్రియురాలితో కానిస్టేబుల్ రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న కాలనీ వాసులు

  • డ్యూటీ ప్రకారం బీట్ పుస్తకం పట్టుకుని గ్రామాల్లో తిరగాలి
  • స్టేషన్ లో సంతకం చేసి.. ప్రియురాలి ఇంటికి చేరుకున్నాడు
  • రాసలీలల్లో మునిగిపోయాడు
డ్యూటీలో ఉంటూ, ప్రియురాలితో రాసలీలల్లో మునిగిపోయిన ఓ కానిస్టేబుల్ ను కాలనీ వాసులు పట్టుకున్న ఘటన కర్నూల్ లో చోటు చేసుకుంది. కర్నూలు సబ్ డివిజన్ పరిధిలోని ఓ స్టేషన్ లో సదరు కానిస్టేబుల్ పని చేస్తున్నాడు. బీట్ పుస్తకం పట్టుకుని గ్రామాల్లో ఆయన తిరగాలి. డ్యూటీ ప్రకారం స్టేషన్ లో సంతకం చేసి, గ్రామాల్లో తిరిగేందుకు బయల్దేరాడు.

కానీ, డ్యూటీని పక్కన పెట్టి, స్థానికంగా ఉన్న రాజీవ్ గృహకల్ప నివాస సముదాయంలోని ప్రియురాలి ఇంటికి చేరుకుని, రాసలీలల్లో మునిగిపోయాడు. అప్పటికే ఆయన వ్యవహారంతో విసిగిపోయిన కాలనీ వాసులు, రెడ్ హ్యాండెడ్ గా ఆయనను పట్టుకున్నారు. అయితే, సహచర కానిస్టేబుళ్ల సాయంతో ఆయన తప్పించుకున్నాడు.

గతంలో కూడా పలువురు మహిళలను తీసుకుని ఈ కానిస్టేబుల్ ఇక్కడకు వచ్చాడని స్థానికులు తెలిపారు. రకరకాల కారణాలు చెప్పి, తప్పించుకునేవాడని వారు చెప్పారు. అయితే, ఈ వ్యవహారానికి సంబంధించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని నాలుగో పట్టణ పోలీసులు తెలిపారు. 
kurnool
constable
romance
caught

More Telugu News