Indigo: కాసేపు ప్రయాణికులను గడగడలాడించిన హైదరాబాద్ - తిరుపతి ఇండిగో విమానం!

  • ఉదయం 6.25కు టేకాఫ్
  • పావుగంటలోనే సాంకేతిక లోపం
  • లోపాన్ని గుర్తించి ఎమర్జెన్సీ ల్యాండ్ చేసిన పైలట్

ఈ ఉదయం 6.25 గంటలకు శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి తిరుపతి వెళ్లేందుకు బయలుదేరిన ఇండిగో విమానం కాసేపు ప్రయాణికులకు గడగడలాడించింది. విమానం గాల్లోకి ఎగిరిన 15 నిమిషాలకే టెక్నికల్ ఫాల్ట్ ను గుర్తించిన పైలట్, దాన్ని తిరిగి వెనక్కు తీసుకువచ్చి విమానాన్ని క్షేమంగా ల్యాండ్ చేశారు.

విమానం ఎందుకు వెనక్కు వస్తోందో తెలియని 65 మంది ప్రయాణికులు ఆ పావుగంట పాటు భయంతో ఆందోళనకు గురయ్యారు. ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ తరువాత, బతుకుజీవుడా అంటూ కిందకు దిగిన వారు, మరో ప్రత్యామ్నాయం చూపాలని ఇండిగో సిబ్బందిని అడిగినా వారు ఏ మాత్రమూ స్పందించలేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. తమ గమ్యానికి ఎలా చేరుకోవాలని ప్రశ్నిస్తున్నారు.

More Telugu News