మధ్యప్రదేశ్ లో జీపుపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్... 12 మంది దుర్మరణం

షార్ట్స్‌లో చూడండి
మధ్యప్రదేశ్ లో ఈ రోజు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కుటుంబ వేడుక కోసం జీపులో వెళుతున్న వారిని మృత్యువు కబళించింది. అదుపు తప్పిన ఓ ట్రాక్టర్ జీపుపైకి దూసుకుపోవడంతో అందులో ప్రయాణిస్తున్న 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మొరెనాకు 4 కిలోమీటర్ల దూరంలో గంజ్రాంపూర్ వద్ద ఈ ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన ఆరుగురిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని కారణాలపై దర్యాప్తు మొదలు పెట్టారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఓ ట్రాక్టర్ ఈ ప్రమాాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. 
Go Back to Shorts
madhyapradesh
accident

More Telugu News