Deepika Padukone: ఎట్టకేలకు వివాహం... దీపిక, రణవీర్ ల పెళ్లి తేదీ ఖరారు!

  • కొంతకాలంగా పీకల్లోతు ప్రేమలో దీపిక, రణవీర్ సింగ్
  • నవంబర్ 10న వివాహమంటూ వార్తలు
  • రెండు కుటుంబాలూ నిర్ణయించినట్టు చెబుతున్న బాలీవుడ్
గత కొంతకాలంగా పీకల్లోతు ప్రేమలో మునిగున్న బాలీవుడ్ సెలబ్రిటీల జంట దీపికా పదుకునే, రణవీర్ సింగ్ ల వివాహం నవంబర్ 10వ తేదీన జరుగుతుందని సమాచారం. ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, తీవ్ర చర్చల అనంతరం రెండు కుటుంబాలూ నవంబర్ 10ని ఫిక్స్ చేశాయన్న వార్త బాలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది.

ఇక పెళ్లి ఎక్కడన్న విషయమై ఆరా తీస్తే, ఉదయ్ పూర్ లోని విలాసవంతమైన ప్యాలెస్ లో వివాహ వేడుకను నిర్వహించాలని రెండు కుటుంబాలు భావిస్తున్నాయని, ఈ విషయంలో దీపిక ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. చేతిలో ఉన్న సినిమాలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి, వివాహానికి సిద్ధం కావాలని దీపిక, రణవీర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Deepika Padukone
Ranaveer singh
Marriage
Bollywood

More Telugu News