sumanth ashwin: ఆసక్తిని రేపుతోన్న 'హ్యాపీ వెడ్డింగ్' టీజర్

  • సుమంత్ .. నిహారిక 'హ్యాపీ వెడ్డింగ్'
  • ముఖ్య పాత్రల్లో నరేశ్ .. మురళీ శర్మ 
  • ఈ నెల 30వ తేదీన ట్రైలర్ రిలీజ్

కథలో విషయం ఉండాలే గానీ .. ప్రేమకథలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. అందువల్లనే యూత్ ను దృష్టిలో పెట్టుకునే ప్రేమకథా చిత్రాలు ఎక్కువగా వస్తుంటాయి. అలా యూవీ క్రియేషన్స్ వారు 'హ్యాపీ వెడ్డింగ్' అనే ప్రేమకథా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుమంత్ అశ్విన్ .. నిహారిక జంటగా రూపొందుతోన్న ఈ సినిమాకి లక్ష్మణ్ కార్య దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

 తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టు ఇన్విటేషన్ పేరుతో టీజర్ ను రిలీజ్ చేశారు. పెద్దల పెళ్లి మాటలపై .. పిల్లల ప్రేమ వ్యవహారానికి సంబంధించిన షాట్స్ తో ఈ టీజర్ ను కట్ చేశారు. సుమంత్ అశ్విన్ పాత్ర పేరు 'ఆనంద్' అనీ .. నిహారిక పాత్ర పేరు 'అక్షర' అనే విషయాన్ని ఈ టీజర్ ద్వారా చెప్పేశారు. హీరో తండ్రి పాత్రలో నరేశ్ .. హీరోయిన్ తండ్రి పాత్రలో మురళీశర్మ కనిపిస్తున్నారు. ఈ నెల 30వ తేదీన ఉదయం 10 గంటల 36 నిమిషాలకి ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదలనున్నట్టు ఈ టీజర్ ద్వారానే తెలియజేశారు. 

  • Loading...

More Telugu News