akhil: రొమాంటిక్ హీరోగా కనిపించనున్న అఖిల్

  • వెంకీ అట్లూరితో అఖిల్ 
  • ఆయన జోడీగా నిధి అగర్వాల్ 
  • రెండు నెలల పాటు లండన్ లోనే షూటింగ్

అఖిల్ మూడవ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వాళ్ల నిరీక్షణకు తెరదించేస్తూ ఈ సినిమా షూటింగ్ ఈ రోజున 'లండన్'లో మొదలైంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా .. రెండు నెలల పాటు లండన్ లోనే షూటింగ్ జరుపుకోనుంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు.

ఈ సినిమాకి సంబంధించిన 50 శాతానికి పైగా షూటింగ్ ఈ రెండు నెలలలో పూర్తి చేస్తారు. ఈ సినిమాలో అఖిల్ ప్లే బాయ్ గా .. రొమాంటిక్ హీరోగా కనిపిస్తాడని అంటున్నారు. తెలుగులో నాగార్జున రొమాంటిక్ హీరోగా మంచి మార్కులు కొట్టేశాడు. అఖిల్ కూడా ఆ ఇమేజ్ ను సొంతం చేసుకుంటాడేమో చూడాలి. ఈ సినిమాలో ఆయన జోడీగా నిధి అగర్వాల్ కనిపించనున్న సంగతి తెలిసిందే.     

More Telugu News