indraganti: ఇంద్రగంటిని కథ రెడీ చేయమని చెప్పిన మహేశ్ బాబు?

  • 'సమ్మోహనం'కి తొలిరోజునే సక్సెస్ టాక్
  • ఇంద్రగంటిపై దృష్టి పెట్టిన హీరోలు  
  • సుధీర్ బాబు ద్వారా తెలుసుకున్న మహేశ్ 
ఎప్పటికప్పుడు వైవిధ్యభరితమైన కథలను తయారుచేసుకుంటూ ప్రేక్షకులను ప్రభావితం చేయడంలో ఇంద్రగంటి మోహనకృష్ణ ముందుంటారు. కథల విషయంలో ఆయన కొత్తదనానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారనడానికి నిదర్శనంగా 'అష్టాచమ్మా' .. 'గోల్కొండ హైస్కూల్' .. 'అమీతుమీ' కనిపిస్తుంటాయి. తాజాగా ఆయన నుంచి వచ్చిన 'సమ్మోహనం' సినిమా తొలిరోజునే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఆయన దర్శకత్వంలో చేయడానికి కుర్ర హీరోలు మాత్రమే కాదు .. స్టార్ హీరోలు కూడా ఆసక్తిని చూపుతున్నారని వినికిడి.

ఈ సినిమాలో హీరో సుధీర్ బాబు కావడం వలన, ఆయన ద్వారా ఇంద్రగంటి టేకింగ్ గురించి మహేశ్ బాబు వినివున్నాడు. ఈ సినిమా ద్వారా ఆయన ప్రతిభ ఏమిటనేది మహేశ్ గ్రహించాడు. ప్రస్తుతం తాను చేస్తోన్న ప్రాజెక్టులు పూర్తయ్యేలోగా ఒక మంచి కథను రెడీ చేయమని ఆయనతో మహేశ్ చెప్పినట్టుగా ఒక టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. అన్నీ కుదిరితే భవిష్యత్తులో ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రూపొందే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.     
indraganti

More Telugu News