Vadodara: మోదీ మాట విన్నాడు... పకోడీలమ్మి లక్షాధికారి అయ్యాడు!

  • వడోదర యువకుని స్వయం ఉపాధి 
  • ఒకటి నుంచి 35కు పెరిగిన పకోడీ స్టాల్స్
  • నెలకు రూ. 9 లక్షల ఆదాయం

గతంలో "పకోడీలు అమ్ముకోవడం కూడా ఉద్యోగమే" అన్న ప్రధాని నరేంద్ర మోదీ మాటలపై కొందరు విమర్శలు కురిపించినా, ఆ మాటలనే స్ఫూర్తిగా తీసుకుని పకోడీల వ్యాపారాన్ని మొదలు పెట్టిన గుజరాత్ యువకుడు, ఇప్పుడు నెలకు రూ. 9 లక్షలు సంపాదించే స్థాయికి చేరాడు. తనతో పాటు మరో పదిమందికి ఉపాధి కల్పించాడు.

వడోదరకు చెందిన నారాయణ అనే యువకుడు హిందీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఏ ఉద్యోగమూ లేని వేళ, ప్రధాని మాట చెవిన పడడంతో పకోడీల దుకాణాన్ని ప్రారంభించాడు. రోజుకు 10 కిలోల పకోడీలను తయారు చేసి విక్రయించేవాడు. మెల్లగా రుచి నచ్చడంతో కస్టమర్ల సంఖ్య పెరిగింది. ఫలితంగా తన స్టాల్స్ సంఖ్యను ఒకటి తరువాత ఒకటి పెంచుకుంటూ పోయాడు. ప్రస్తుతం వడోదరలో నారాయణ్ పకోడీ స్టాల్స్ 35 వరకూ ఉన్నాయి. రోజుకు 500 కిలోల పకోడీలు ఇక్కడ తయారవుతుండగా, రోజుకు రూ. 30 వేలకు పైగా ఆదాయం లభిస్తోంది. అంటే నెలకు దాదాపు రూ. 9 లక్షల వరకూ అన్నట్టు. తాను ఈ స్టాల్ ను ప్రారంభించానంటే అది మోదీ చలవేనని చెబుతుంటారు నారాయణ్.

  • Loading...

More Telugu News