Nizamabad District: పెళ్లి కొడుకుపై దాడి చేసి.. అమ్మాయిని ఎత్తుకెళ్లిన వైనం.. వీడియో వైరల్

  • నిజామాబాద్‌ జిల్లా ఇందూరులో ఘటన
  • మేజర్‌లయిన ప్రాణదీప్‌, సౌజన్య
  • ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకునేందుకు వచ్చిన ప్రేమికులు
పెళ్లి కొడుకుపై దాడి చేసి, వధువుని భుజంపై వేసుకుని బంధువులు ఎత్తుకెళ్లిన ఘటన నిజామాబాద్ జిల్లా ఇందూరు గ్రామంలో చోటుచేసుకుంది. మేజర్‌లయిన ప్రాణదీప్‌, సౌజన్య అక్కడి ఆర్యసమాజ్‌లో ప్రేమ పెళ్లి చేసుకునేందుకు వచ్చారు. మరో ఐదు నిమిషాల్లో పెళ్లి ముగుస్తుందనగా.. అక్కడికి వచ్చిన అమ్మాయి తరఫు బంధువులు ప్రాణదీప్‌పై దాడి చేశారు. సౌజన్యపై కూడా స్వల్పంగా దాడి చేసి ఆమెను బలవంతంగా ద్విచక్రవాహనంపై తీసుకెళ్లారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీనిపై ప్రాణదీప్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాము మేజర్లమని, ఇద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకుంటుండగా దాడి చేశారని చెప్పాడు. కాగా, యువతిని తీసుకెళుతుండగా స్థానికులు స్మార్ట్‌ఫోన్‌లలో వీడియో తీశారు.                                
Nizamabad District
lovers

More Telugu News